Maredumilli: అభ్యర్థుల ఎంపికలో కార్యకర్తలే నిర్ణేతలు: ఎమ్మెల్యే శిరీషాదేవి
Maredumilli: రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యకర్తల అభీష్టానికే పెద్దపీట వేస్తామని రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్‌పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి స్పష్టం చేశారు.
Maredumilli: అభ్యర్థుల ఎంపికలో కార్యకర్తలే నిర్ణేతలు: ఎమ్మెల్యే శిరీషాదేవి
Maredumilli: అభ్యర్ధుల ఎంపికలో కార్యకర్తలే నిర్ణేతలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. పోలవరం జిల్లా,రంప చోడవరం నియోజక వర్గంలోని మారేడుమిల్లి మండల కేంద్రంలో మంగళవారం మండల పార్టీ అధ్యక్షులు గురుకు శేషు కుమార్, అధ్యక్షతన * మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమాలు నిర్వహించారు.
ఆయా చోట్ల నిర్వహించిన కార్యక్రమాల్లో ఆమెకు పార్టీ శ్రేణులు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త అకుంఠిత దీక్షతో పనిచేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ధర్మానికి ప్రాధాన్యం ఇస్తున్నామని పేర్కొన్నారు.
అలాగే అభ్యర్ధుల ఎంపిక అనేది పార్టీ నియమ నిబంధనలు ప్రకారం నడుచుకునే వారికి కార్యకర్తల అభీష్టానికి కట్టుబడి ఎంపిక చేయనున్నట్లు స్పష్టం చేశారు. ప్రతీ వార్డులో తెలుగుదేశం జెండా ఎగిరేలా కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు.
తనవంతుగా ఏమి చేయాలో స్పష్టంగా చెబితే చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కార్యకర్తల కష్టాలు అన్నీ దగ్గరుండి చూసిన వ్యక్తిని అని కార్యకర్తల కష్టానికి లోబడి పనిచేస్తానన్నారు.
పార్టీ ఆదేశాలే శిరో ధార్యంగా పనిచేయాలి
తెలుగుదేశం పార్టీ అత్యంత క్రమశిక్షణ గల పార్టీ అని నియోజక వర్గ స్థానిక సంస్థల ఎన్నికల పరిశీలకులు కుడుపూడి సత్తిబాబులు అన్నారు. మారేడుమిల్లి ,దేవీపట్నం మండలాల్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమాల్లో వారు మాట్లాడారు.
పార్టీలో ఎంత క్రమశిక్షణతో ఉంటారో అంత భవిష్యత్తు ఉంటుందన్నారు. పార్టీ ఆదేశాలు మేరకు ప్రతీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లే వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు. పార్టీ సిద్ధాంతాలు కోసం క్రమశిక్షణతో పనిచేసి ప్రగతి సాధించాలని సూచించారు.
విభేదాలు పక్కనపెట్టి ప్రస్తుతం జరిగే ఎన్నికలు మీవి అన్న భావనతో పనిచేయాలని సూచించారు. తద్వారా గ్రామాల్లో అభివృద్ధిని మరింత వేగవంతం చేసుకోవటానికి మంచి అవకాశం ఉందన్నారు.
ఐక్యతతో మంచి ఫలితాలు వస్తాయి
స్థానిక సంస్థలు ఎన్నికల్లో పార్టీ శ్రేణులు ఐక్యతతో పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేర్కొన్నారు. మారేడుమిల్లి మండల కేంద్రంలో మంగళవారం నిర్వహించిన మండల పార్టీ విస్తృత స్థాయి సమావేశం కార్యక్రమాల్లో వారు మాట్లాడారు.
స్థానిక సంస్థలు ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే అవకాశాలు ఇచ్చే అవకాశం కార్యకర్తలది అన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో ప్రతీ కార్యకర్త పార్టీ ఆదేశాలు మేరకు పనిచేయాలన్నారు.
ఐక్యతతో పనిచేసి ఇప్పటికే మన పోలవరం జిల్లా పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక దృష్టి పెట్టారని పేర్కొన్నారు. దానికి అనుగుణంగా మనం కూడా మంచిగా విజయాలు అందిస్తే మంచి అభివృద్ధిని సాధించుకునే అవకాశం ఉందన్నారు.
కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, నియోజక వర్గ స్థానిక సంస్థలు ఎన్నికల పరిశీలకులు కుడుపూడి సత్తిబాబు APIIC డైరెక్టర్ గొల్లపూడి పెద్దిరాజు రాష్ట్ర దూదేకుల కార్పొరేషన్ సభ్యులు షేక్ సుభానీ, AMC చైర్మన్ లోతా లక్ష్మణరావు, మండల పార్టీ అధ్యక్షులు గురుకు శేషు కుమార్, తెదేపా అరకు పార్లమెంట్ ఉపాధ్యక్షులు దంతులూరి శివరామ చంద్ర రాజు,రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ భాషీర్, క్లస్టర్ ఇంచార్జ్, డాక్టర్ పల్లాల రాజ్ కుమార్ రెడ్డి,అరకు పార్లమెంట్ TNSF కార్యదర్శి దూడ ప్రణీత్, కార్పొరేషన్ సొసైటీ చైర్మన్ పల్లాల లక్ష్మి భూపతిరెడ్డి సొసైటీ డైరెక్టర్ గొర్రెలహరి భాస్కరరావు రంపచోడవరం నియోజకవర్గం ఐటీడీపీ అధ్యక్షులు పాము రాంబాబు మండల ప్రధాన కార్యదర్శి కర్రీ సన్యాసిరెడ్డి మండల ఉపాధ్యక్షులు దూడ సువర్ణ కర్ణ కుమార్ ఎంపీటీసీలు కొరగాని సువర్ణ రాజు సాధల బున్నమ్మ మండల తెలుగు యువత అధ్యక్షులు మల్లా బలరాం మాజీ మండల అధ్యక్షులు పుచ్చల గురునాథరెడ్డి బి శెట్టి అప్పాజీ మాజీ సర్పంచులు వీరవల్లి జార్జి బాబు సార్ల రమాదేవి సార్ల మంగిరెడ్డి సాధల ప్రేమ్ కుమార్ రెడ్డి పోడియం కన్నపుదొరా మురళ కనకభూషణం యూనిట్ ఇన్చార్జ్ అందాల సూర్యనారాయణ రెడ్డి కత్తుల రత్నారెడ్డి కత్తుల బంగారు రెడ్డి మాదాసి తిరుపతిరావు కట్రం సోమరాజు సుండం ప్రకాశరావు విండేల గోపి పోదులూరు మంగిరెడ్డి రేవుల జానకి రెడ్డి తదితర తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.




