Tanuku: తణుకు 3వ వార్డు సీపీఐ అభ్యర్థిని ఇందిరా జ్యోతిని గెలిపించాలి!
Tanuku: తణుకు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన 3వ వార్డు సీపీఐ అభ్యర్థి బొద్దాని ఇందిరా జ్యోతి గెలుపు కోరుతూ బుధవారం కోనాల భీమారావు ప్రచారం చేశారు.
Tanuku: తణుకు 3వ వార్డు సీపీఐ అభ్యర్థిని ఇందిరా జ్యోతిని గెలిపించాలి!
తణుకు: తణుకు మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన మూడో వార్డు సీపీఐ అభ్యర్థి బొద్దాని ఇందిరా జ్యోతి గెలుపు కోరుతూ బుధవారం వార్డులో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు కరపత్రాలను ఆవిష్కరించి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అంకితభావంతో పనిచేసే ఇందిరా జ్యోతిని గెలిపించాలని కోరారు. వార్డు అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసే అభ్యర్థికి ప్రజలు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, తణుకు ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, పట్టణ సమితి సభ్యులు బొద్దాని మురళీ, కృష్ణ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.




