Bhimavaram: ఆక్వా రంగం అభివృద్ధికి కేంద్ర పరిశీలన బృందం పర్యటన!
Bhimavaram: పశ్చిమ గోదావరి జిల్లాలో 'ఒక జిల్లా – ఒక ఉత్పత్తి' (ODOP) కింద రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్లను కేంద్ర బృందం పరిశీలించింది.
Bhimavaram: ఆక్వా రంగం అభివృద్ధికి కేంద్ర పరిశీలన బృందం పర్యటన!
భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లాను కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక “ఒక జిల్లా – ఒక ఉత్పత్తి” కార్యక్రమం కింద ప్రత్యేక ఉత్పత్తి జిల్లాగా ప్రకటించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఫ్రాన్స్ కల్చర్, ప్రాసెసింగ్ యూనిట్లను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఒక జిల్లా – ఒక ఉత్పత్తి (ODOP) బృందం జిల్లాలో పర్యటిస్తోంది.
ఈ సందర్భంగా బుధవారం భీమవరం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణిని ఒక జిల్లా – ఒక ఉత్పత్తి బృందం సభ్యులు ఇష్‌దీప్ చంద్, స్మిత్ మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లాలో ఫ్రాన్స్ కల్చర్, ఆక్వాకల్చర్, ప్రాసెసింగ్ రంగాల అభివృద్ధి, ఉత్పత్తి సామర్థ్యం, ప్రాసెసింగ్ యూనిట్ల పనితీరు, మార్కెటింగ్ అవకాశాలు తదితర అంశాలపై వారు జిల్లా కలెక్టర్‌తో చర్చించారు.
ఈ సందర్భంగా ఒక జిల్లా, ఒక ఉత్పత్తి బృందం సభ్యులు మాట్లాడుతూ, ఒక జిల్లా – ఒక ఉత్పత్తి కార్యక్రమం కింద భీమవరం జిల్లాకు ఫ్రాన్స్ కల్చర్, ప్రాసెసింగ్ రంగాన్ని గుర్తించే అంశంపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని ఫ్రాన్స్ ప్రాసెసింగ్ యూనిట్లను, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని, మౌలిక సదుపాయాలను, ఉపాధి కల్పన, ఎగుమతుల అవకాశాలు, మార్కెటింగ్ వ్యవస్థ తదితర అంశాలను పరిశీలించి, సమగ్ర నివేదికను కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని వెల్లడించారు.
జిల్లాలో ఆక్వాకల్చర్ రంగం విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో, ఫ్రాన్స్ ఉత్పత్తి, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తులు, మార్కెటింగ్, ఎగుమతులకు ఉన్న అవకాశాలను అధ్యయనం చేయడం ద్వారా జిల్లాకు “ఒక జిల్లా – ఒక ఉత్పత్తి” కార్యక్రమం కింద ప్రత్యేక గుర్తింపు లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఒక జిల్లా, ఒక ఉత్పత్తి కార్యక్రమం ద్వారా స్థానికంగా ప్రత్యేకత కలిగిన ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడం, ఉత్పత్తిదారులకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను పెంపొందించడం వంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి.
ఈ నేపథ్యంలో జిల్లాలోని ఫ్రాన్స్ కల్చర్, ప్రాసెసింగ్ రంగానికి మరింత ప్రోత్సాహం లభించేలా అవసరమైన అంశాలను బృందం పరిశీలిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, హ్యాండ్లూమ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు.




