Penumantra: పెనుమంట్రలో ఘనంగా చెకుముకి సైన్స్ సంబరాలు!
Penumantra: పెనుమంట్రలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాలు. మార్టేరు పాఠశాల ప్రథమ స్థానం సాధించి జిల్లా స్థాయికి ఎంపిక. ముఖ్య అతిథిగా డాక్టర్ ఒ. భారతి హాజరు.
Penumantra: పెనుమంట్రలో ఘనంగా చెకుముకి సైన్స్ సంబరాలు!
పెనుమంట్ర: జన విజ్ఞాన వేదిక ప్రతి సంవత్సరం నిర్వహించబడే చెకుముకి సైన్స్ సంబరాలలో భాగంగా మండల స్థాయి పోటీలను ఈరోజు అనగా ది 11-9-2026, శుక్రవారం నాడు RAZPHS పెనుమంట్ర నందు పెనుమంట్ర మండల స్థాయి సంబరాలు నిర్వహించడమైనది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఒ.భారతి గారు విచ్చేసి విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రత మరియు మంచి ఆహారపు అలవాట్లపై అవగాహన కల్పించారు.
పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు డి. శ్రీనివాస్ గారు చెకుముకి ప్రశ్నపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన మండల స్థాయి టెస్ట్ నందు మండలంలోని ఎనిమిది పాఠశాలల నుండి 24 మంది విద్యార్థులు హాజరు కాగా BDZPHS మార్టేరు పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం పొంది జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనారు. ZPHS మాముడూరు విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు జె.రామ లక్ష్మణరావు,పడాల నర్సిరెడ్డి, సి హెచ్ నాగప్రియ, కె. పద్మజ, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.




