Poduru: ఏకలవ్య అకాల మరణం పార్టీకి తీరని లోటు: చెరుకువాడ నరేష్ వర్మ!

Poduru: పోడూరు మండల వైఎస్సార్‌సీపీ యూత్ అధ్యక్షుడు గెద్దాడ ఏకలవ్య మృతి పట్ల మాజీ మంత్రి రంగనాథరాజు తనయుడు చెరుకువాడ నరేష్ వర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

E.ABRAHAM, ACHANTA
Updated on: 16 Sept 2026 8:24 PM IST
Poduru
X

Poduru: ఏకలవ్య అకాల మరణం పార్టీకి తీరని లోటు: చెరుకువాడ నరేష్ వర్మ!

పోడూరు: పోడూరు మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు, పండితవిల్లూరు సొసైటీ మాజీ అధ్యక్షులు గెద్దాడ ఏకలవ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబాన్ని రాష్ట్ర మాజీ మంత్రి, చెరుకువాడ శ్రీ రంగనాథరాజు తనయులు చెరుకువాడ వెంకట నరసింహారాజు (నరేష్ వర్మ) బుధవారం పరామర్శించారు.

ఏకలవ్య చిన్నవయసులోఆకస్మికంగా మృతి చెందడం ఎంతో బాధాకరమన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఏకలవ్య పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పని చేశారని కొనియాడారు. ఏకలవ్య కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తామని నరేష్ వర్మ ధైర్యం చెప్పారు. ముందుగా ఆయన పార్టీ నాయకులతో కలిసి ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.

నరేష్ వర్మ తో పాటు ఏకలవ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో పోడూరు జడ్పిటిసి గుంటూరి పెద్దిరాజు, మాజీ సర్పంచ్ ఇళ్ల లక్ష్మి చంద్రిక శ్రీనివాస్, ఎంపీటీసీ ఇందుకూరి వరహాలు రాజు, వైసిపి నాయకులు గుబ్బల వీర బ్రహ్మం, పోతుమూడి రామచందర్రావు, సదమళ్ళ నాగరాజు, గొట్టుముక్కలు ఏసు రత్నం , గొట్టుముక్కల సునీల్ వర్మ, సదమల్ల వెంకటేష్ , కడలి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA