Penugonda: పెనుగొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే!
Penugonda: పెనుగొండ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో శనివారం చిల్డ్రన్స్ డే, చైల్డ్ న్యూట్రి గార్డెన్ వేడుకలు ఘనంగా జరిగాయి.
Penugonda: పెనుగొండ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో ఘనంగా చిల్డ్రన్స్ డే!
పెనుగొండ: పెనుగొండ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల నందు చిల్డ్రన్స్ డే మరియు చైల్డ్ న్యూట్రి గార్డెన్ సెలబ్రేషన్ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీడీవో టీఎస్ మూర్తి, మరియు మండల విద్యాశాఖాతం రామకృష్ణ జరిగింది.
ఏపీ ఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఐ ఎస్ సెక్రటరీ తేజ్ భారత్ ఆదేశాల మేరకు " బాలల హరిత మహోత్సవం" కార్యక్రమం ద్వారా పాఠశాలలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు పాఠశాలలో విద్యార్థులు పెంచే విధంగా. విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది . ఈ కార్యక్రమంలో ఎంఈఓ ప్రిన్సిపల్ ఎంపీడీవో సిబ్బంది మొక్కలు నాటడం జరిగింది.
ఎంపీడీవో టీఎస్ మూర్తి విద్యార్థినులను ఉద్దేశించి క్రమశిక్షణ మరియు నైతిక విలువలతో కూడిన ప్రవర్తననం చిన్నతనం నుంచి అలవరచు కోవాలని, మరియు విద్యార్థులు ఉత్తమ పౌరులుగా ఎదిగి భారత దేశాన్ని ప్రపంచ దేశాలలో ముందుండి విధంగా చేయాలని చెబుతూ బాలలకు శుభాకాంక్షలు తెలియ జేనారు. ఎంఈఓరామ కృష్ణ మాట్లాడుతూ మంచి విద్యను అభ్యసించి ఉత్తమ పౌరుడిగా ఎదగాలని ఉత్తమ లక్ష్యాలు ఏర్పరచుకుని వాటికోసం కృషి చేయాలని తెలియజేశారు.
పాఠశాల ప్రిన్సిపల్ పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల ద్వారా అవగాహన పెంచుకుని అభివృద్ధిలో ముందుకు సాగాలని బాలల దినోత్సవం సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు నిర్వహించిన వివిధ పోటీలలో విజేతలుగా నిలిచిన బాలలకు సర్టిఫికెట్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం సుబ్బలక్ష్మి మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.




