Chintoor: చింతూరులోనే ఆటో ఫిట్‌నెస్ పరీక్షలు చేయాలి: ఆటో యూనియన్

Chintoor: చింతూరు ఏజెన్సీ ఆటోల ఫిట్‌నెస్ పరీక్షలను రాజానగరం కాకుండా చింతూరు కేంద్రంగానే నిర్వహించాలని ఆటో యూనియన్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

RAJESH REDDY, CHINTOOR
Published on: 6 Oct 2026 5:55 PM IST
Chintoor
X

Chintoor: చింతూరులోనే ఆటో ఫిట్‌నెస్ పరీక్షలు చేయాలి: ఆటో యూనియన్

చింతూరు: చింతూరు ఏజెన్సీలోని ఆటోల ఫిట్‌నెస్ (బ్రేక్)పరీక్షలను చింతూరులో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆటో యూనియన్ సభ్యులు కోరారు. విలీన మండలాలకు సంబంధించి చింతూరు కేంద్రంగా ఫిట్నెస్( బ్రేక్) పరీక్షలు నిర్వహించే వారని,గత మూడు నెలలుగా స్కానర్ ద్వారా బ్రేక్ పరీక్షల కోసం రాజమండ్రి దగ్గర గల రాజానగరం వెళ్లాల్సి వస్తోందన్నారు.

దీంతో చింతూరు ఏజెన్సీలోని ఆటో యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. రాజానగరంలో స్కానర్ ద్వారా 100 వాహనాలను పరీక్షించగా సుమారు 90 వాహనాలకు పరీక్షలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

దీనివలన ప్రభుత్వానికి ఆదాయం కోల్పవడంతో పాటు వాహన యజమానులు ఘాట్‌రోడ్ల ప్రయాణంతో సమయం, ఖర్చులతో నానా అవస్థలు పడాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు.రవాణాశాఖ మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్,ఐటీడీఏ పీఓ స్పందించి చింతూరులోనే ఫిట్‌నెస్ యూనిట్‌ను కొనసాగించాలా చర్యలు తీసుకోవాలని ఆటో యజమానులు ముక్తకంఠంతో వేడుకున్నారు.

RAJESH REDDY, CHINTOOR

RAJESH REDDY, CHINTOOR