Chintoor: రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: చింతూరు సీఐ గోపాలకృష్ణ
Chintoor: చింతూరులో ఆపరేషన్ త్రిశూల్ కింద ఆటో డ్రైవర్లతో రోడ్డు భద్రతా ర్యాలీ నిర్వహించారు; గంజాయి అక్రమ రవాణాపై సీఐ గోపాలకృష్ణ కఠిన హెచ్చరికలు జారీ చేశారు.
Chintoor: రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: చింతూరు సీఐ గోపాలకృష్ణ
చింతూరు: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని చింతూరు సిఐ గోపాలకృష్ణ పిలుపు నిచ్చారు.ఆపరేషన్ త్రిసూల్ లో భాగంగా చింతూరు సిఐ గోపాలకృష్ణ, ఎస్సై సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ సభ్యులతో చింతూరు ప్రధాన సెంటర్లో ర్యాలీ చేపట్టారు.ఆటో,టాటా మ్యాజిక్ డ్రైవర్లకు రోడ్డు భద్రతా నియమాలు పై సి ఏ గోపాలకృష్ణ అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా గోపాలకృష్ణ మాట్లాడుతూ ఆటోల్లో పరిమితి కి మించి ప్రయాణికులను ఎక్కించరాదని సూచించారు.మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని ఆదేశించారు.ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని,ఓవర్ స్పీడ్ గా వాహనాలు నడపరాదని, ద్విచక్ర వాహనాల పై ఇద్దరు కంటే ఎక్కువ ప్రయాణించడకూడదని పేర్కొన్నారు.
వాహనానికి సంబంధించిన రికార్డులు సక్రమంగా ఉండాలని తెలిపారు. జిల్లా ఎస్పీ చక్రవర్తి ,యస్ డి పి ఓ ఉదయ పావని ఆదేశాల మేరకు గ్రామ గ్రామాన పోలీసుల ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గంజాయి అమ్మటం,కొనటం, సేవించడం నేరమని అలా చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి వ్యాపారం చేస్తే దాని ద్వారా సంపాదించిన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుందని పేర్కొన్నారు. అలాగే మహిళలను ఎవరైనా ఈవ్ టీజింగ్ చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో చింతూరు ఎస్సై సంతోష్ కుమార్,పోలీస్ సిబ్బంది, ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.




