Undi: చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఆకివీడు సీఐ కాళీచరణ్!

Undi: ఉండి జడ్పీ ఉన్నత పాఠశాలలో డ్రగ్స్ దుష్ప్రభావాలు, పోక్సో చట్టంపై విద్యార్థులకు ఆకివీడు సీఐ కాళీచరణ్, ఎస్సై మల్లికార్జునరావు అవగాహన కల్పించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 5 Oct 2026 7:55 PM IST
Undi
X

Undi: చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి: ఆకివీడు సీఐ కాళీచరణ్!

​ఉండి: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, చదువుపై శ్రద్ధ చూపి తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆకివీడు సీఐ కాళీచరణ్ సూచించారు. ​సోమవారం ఉండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉండి ఎస్సై మల్లికార్జునరావుతో కలిసి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలు, డ్రగ్స్ దుర్వినియోగం వల్ల కలిగే తీవ్ర నష్టాలను, చెడు అలవాట్ల వల్ల జీవితాలు ఏ విధంగా నాశనం అవుతాయో విద్యార్థులకు వివరంగా తెలియజేశారు.

​అలాగే పోక్సో (POCSO) చట్టం, బాలికల రక్షణ, భద్రతతో పాటు అత్యవసర పరిస్థితుల్లో ఎవరిని సంప్రదించాలి, పోలీసు సేవలను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే అంశాలపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ​ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రామలక్ష్మి, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM