Penugonda: 19 ఏళ్లుగా పెరగని వేతనాలు.. పెనుగొండలో పంచాయతీ కార్మికుల నిరసన

Penugonda: గత 19 ఏళ్లుగా కనీస వేతనాలు సవరించకపోవడంతో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పెనుగొండలో సీఐటీయూ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది.

E.ABRAHAM, ACHANTA
Published on: 3 July 2026 8:39 PM IST
Penugonda
X

Penugonda: 19 ఏళ్లుగా పెరగని వేతనాలు.. పెనుగొండలో పంచాయతీ కార్మికుల నిరసన

Penugonda: పెనుగొండలో శుక్రవారం నిర్వహించిన పంచాయతీ కార్మికుల సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు ఎస్. వెంకటేశ్వరరావు, ఎం. ఆంజనేయులు మాట్లాడుతూ, కనీస వేతనాల పెంపు కోసం రాష్ట్రవ్యాప్తంగా సీఐటీయూ పోరుబాట చేపట్టిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని మండలాల్లో ఉద్యోగులు, కార్మికులను కలిసి అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.

గత 19 ఏళ్లుగా కనీస వేతనాలు సవరించకపోవడంతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వెంటనే కనీస వేతనాలను సవరించి ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులు, కార్మికుల వేతనాలను పెంచాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో పంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు కిరణ్, రమేష్, విజయ, సురేష్, పండు తదితరులు పాల్గొన్నారు. కార్మికులతో సిఐటియు నాయకులు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story