Tanuku: దేశ స్వాతంత్య్ర పోరాటంలో కార్మికుల పాత్ర మరువలేనిది!
Tanuku: తణుకులో 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆటో కార్మికుల సమస్యలపై మాట్లాడిన సిఐటియు నేత మునిస్వామి. స్త్రీ శక్తి పథకంతో ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతిన్నదని ఆవేదన.
Tanuku: దేశ స్వాతంత్య్ర పోరాటంలో కార్మికుల పాత్ర మరువలేనిది!
Tanuku: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు శనివారం ఆర్టీసీ బస్టాండ్ వద్ద భారతమాత ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . జెండా వందనం అనంతరం మునిస్వామి మాట్లాడుతూ ఈ దేశ స్వాతంత్రం కోసం పోరాడిన వారిలో కార్మికులు ముందు బాగానా ఉన్నారని వారి త్యాగాలు కూడా మరువరాదని అన్నారు.
నేడు కార్మికుల పరిస్థితులు చాలా దీనస్థితిలో ఉన్నవని వాటిని మెరుగుపరుచుకోవడానికి సంఘాల ద్వారా పోరాటాలు మార్గమన్నారు. ఆటో రంగం పై లక్షలాదిమంది ఉపాధి పొందుతున్న పరిస్థితుల్లో, ప్రభుత్వం వారి పొట్టపై కొట్టే విధంగా స్త్రీ శక్తి పథకాన్ని తీసుకువచ్చిందని అన్నారు.
దీనివల్ల ఆటో కార్మికులకు కిరాయిలు లేక అష్టకష్టాలు పడుతూ కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, మరోపక్క ఆటో రుణాలు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
ఆటో కార్మికులకు గతంలో ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఆర్టీవో లే జారీ చేసే వారిని ఇప్పుడు ప్రైవేటు యాజమాన్యానికి ఇవ్వడం వల్ల సర్టిఫికెట్ పొందడంలో కార్మికులు అనేక ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నారని మునుస్వామి అన్నారు.
వీటిని ప్రభుత్వమే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు పంగం రాంబాబు, సంఘ కార్యదర్శి కంచుమర్తి విశ్వేశ్వరరావు సభ్యులు వేల్పూరి దానయ్య, కాకర్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.




