Velpuru: భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి: CITU!

Velpuru: భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డును పునరుద్ధరించి, 2020 నుంచి దరఖాస్తు చేసుకున్న అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వేల్పూరులో CITU డిమాండ్ చేసింది.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 1 Aug 2026 12:35 PM IST
Velpuru
X

Velpuru: భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి: CITU!

Velpuru: భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ పథకాల అమలు చేయాలని వేల్పూరు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు బళ్ళ చిన వీరభద్రరావు డిమాండ్ చేశారు. బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) సమావేశాన్ని శనివారం అధ్యక్షుడు వాటాల నాగేశ్వరరావు అధ్యక్షతన స్థానిక పార్వతి దేవి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులకు సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తామని అప్పుడప్పుడు కార్మికులను ఊరిస్తూ పత్రికలకు ప్రకటనలు ఇవ్వడం తప్ప ఆచరణ లేదని విమర్శించారు. కార్మికులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు సంక్షేమ బోర్డు పునరుద్ధరించి 2020 నుండి దరఖాస్తు చేసుకున్న భవన నిర్మాణ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వీరభద్రరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్యక్రమంలో సోరపల్లి రామకృష్ణ. అల్లాడి నాగ బలరాం. లంకె దుర్గారావు. యాతం పెద్దరాజు. వాసా వెంకట సుబ్బారావు. తాళ్ల సత్యనారాయణ. వీరవల్లి వెంకన్న. షేక్ ఇస్మాయిల్. దున్నే నాగేశ్వరరావు. గొల్లపల్లి రాజా తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story