Polavaram: 13న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

Polavaram: జూలై 13న పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న సీఎం చంద్రబాబునాయుడు. ప్రాజెక్టు ప్రగతిపై అధికారులతో సమీక్ష, కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 11 July 2026 8:00 PM IST
Polavaram
X

Polavaram: 13న పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు

పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు ఈనెల 13వ తేదీన పోలవరం విచ్చేసి, ప్రాజెక్ట్ పనుల ప్రగతిని పరిశీలిస్తారు.

ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం 1. 05 ని.లకు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి సమీపంలోని వేమగిరి నుండి హెలికాఫ్టర్ లో బయలుదేరి, 1. 20 ని.లకు పోలవరం ప్రాజెక్ట్ సైట్ కి చేరుకుంటారు. ప్రజాప్రతినిధులను, అధికారులను కలుసుకుంటారు.

అనంతరం 2 గంటల నుండి 5. 15 ని.ల వరకు పోలవరం ప్రాజెక్ట్ లోని ఈసిఆర్ ఎఫ్ గాప్-2, పవర్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించి, అధికారులతో సమీక్ష, పాత్రికేయుల సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం 5. 20 ని.లకు పోలవరం ప్రాజెక్ట్ సైట్ నుండి హెలికాఫ్టర్ ద్వారా గుంటూరు జిల్లా తాడేపల్లి బయలుదేరి వెళతారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM

Next Story