Bhimavaram: విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్లు అందజేసిన కలెక్టర్ నాగరాణి!
Bhimavaram: భీమవరంలో నిర్వహించిన PGRS కార్యక్రమంలో కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా విభిన్న ప్రతిభావంతులకు ఉచిత వీల్ ఛైర్లు పంపిణీ చేశారు.
Bhimavaram: విభిన్న ప్రతిభావంతులకు వీల్ చైర్లు అందజేసిన కలెక్టర్ నాగరాణి!
భీమవరం: విభిన్న ప్రతిభావంతులైన పిప్పర మండలం గణపవరం గ్రామానికి చెందిన గుళ్ళ చిన్న మంగమ్మ 39 సంవత్సరములు, పాలకొల్లు కు చెందిన మేడిది శ్యామలత 44 సంవత్సరాలు, వీరు ఇద్దరూ గత వారంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక పి (జి ఆర్ ఎస్) లో వీల్ చైర్స్ కొరకు దరఖాస్తు చేసుకోగా సోమవారం జిల్లా కలెక్టరేట్ పి జి ఆర్ ఎస్ సమావేశ మందిరంలో జరిగిన పి జి ఆర్ ఎస్ సమావేశంలో జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా వీల్ చైర్స్ ను అందజేశారు.
అనంతరం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రతి దరఖాస్తును అధికారులు సానుకూల దృక్పథంతో పరిశీలించి అర్హులైన వారికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా విభిన్న ప్రతిభావంతులకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. వీల్ చైర్స్ అందుకున్న విన్న ప్రతిభావంతులు, పి జి ఆర్ ఎస్ ద్వారా తమ సమస్యను పరిష్కరించి అవసరమైన సహాయాన్ని అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్ కల్పశ్రీ, డి ఆర్ ఓ పీ ప్రభాకర్, జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అధికారి బి రామ్ కుమార్, డి ఆర్ డి ఎ పి డి పి వేణుగోపాల్ వేణుగోపాల్ తదితరులు ఉన్నారు.




