Chinturu: చింతూరు ఐటీడీఏ వద్ద సీపీఐ మహాధర్నా!
Chinturu: పోలవరం జిల్లా చింతూరు ఐటీడీఏ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో మహాధర్నా. కటాఫ్ డేట్‌తో సంబంధం లేకుండా నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్.
Chinturu: చింతూరు ఐటీడీఏ వద్ద సీపీఐ మహాధర్నా!
Chinturu: పోలవరంజిల్లా చింతూరు ఐటిడిఏ వద్ద సిపిఐ ధర్నా చేపట్టింది. పోలవరం నిర్వాసితులకు కటాఫ్ డేటుతో సంబంధం లేకుండా పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. వన్ టైం సెటిల్మెంట్ అనే విధానం ఎత్తివేయాలని కోరారు.ముంపు పేరుతో విలీన మండలాల్లో అభివృద్ధి పనులు నిలిపివేయడం తగదని తెలిపారు.
పోలవరం నిర్వాసితులకు తగిన న్యాయం చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేయడం పై మండిపడ్డారు. విలీన మండలాల్లో పెన్షన్, రేషన్ తదితర ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు కందుకూరి స్వర్ణ,డివిజన్ సహాయ కార్యదర్శి వాసం రాము, డివిజన్ కార్యదర్శి గుజ్జ మోహన్ రావు, సహాయ కార్యదర్శి ఎస్కె రంజాన్, మండల కార్యదర్శి మురళి, కూనవరం మండల కార్యదర్శి లంబు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Next Story




