Velairpadu: రామవరంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సమావేశం!

Velairpadu: ఏలూరు జిల్లా రామవరంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సమావేశం.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 27 Jun 2026 8:06 PM IST
Velairpadu
X

Velairpadu: రామవరంలో సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ సమావేశం!

వేలేరుపాడు: ఏలూరు జిల్లా వేలేరుపాడు మండల పరిధిలోని రామవరం గ్రామంలో గడ్డాల ముత్యాల రావు అధ్యక్షతన సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఏలూరు జిల్లా కమిటీ కార్యదర్శి ఎస్కే గౌస్ మాట్లాడుతూ, మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సమాజంలో పేదవాడికి కూడు, గూడు , బట్ట కరువు అయిందని,పాలక వర్గాలు పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్లకు వేల కోట్ల రూపాయలు.

అనేక రాయితీలు కల్పించి వంద, వేల ఎకరాల భూములు అప్పనంగా కట్టబెడుతున్నారని, సామాన్య మనిషి బ్రతకడానికి చారెడు భూమి ఇవ్వాలనే ఆలోచన పాలకవర్గాలకు లేదని, అడవికి మూలం ఆదివాసులు.. అడవిని కాపాడే ఆదివాసి లు సాగు చేసే పోడు భూములకు పట్టాలు ఇవ్వకుండా, వారి హక్కులను కాలరాస్తున్నారని, ఆదివాసీలపై నిత్యం బెదిరింపులు, అదిరింపులు, శారీరక, మానసిక వేధింపులకు గురి చేస్తున్నారని,

పోడు సాగులో క్విడ్ ప్రోకో పద్ధతి కొనసాగుతుందని , ఆర్థిక వసూళ్లలో పైరవీకారుల, మధ్య దళారుల అక్రమాలను అరికట్టాలని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా ఉన్నత అధికారులను కోరుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు సిరికొండ రామారావు, బి. సత్య నారాయణ, కట్టం వీరస్వామి, పోలవరం పార్టీ డివిజన్ కార్యదర్శి కట్టం ముత్యాలరావు, పి. ఓ. డబ్ల్యు జిల్లా కార్యదర్శి ఎస్కేమున్ని పాల్గొన్నారు .

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story