Iragavaram: ఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: సీపీఎం డిమాండ్

Iragavaram: ఓట్ల తొలగింపునకు నిరసనగా ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరంలో సీపీఎం ధర్నా చేపట్టింది.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 1 Oct 2026 6:06 PM IST
Iragavaram
X

Iragavaram: ఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలి: సీపీఎం డిమాండ్

Iragavaram: చీప్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ జిల్లా సెక్రటేరియట్ సభ్యుడు కేత గోపాలం డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో గురువారం ఇరగవరం మండల కేంద్రంలో ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వ్యవహారం పై ధర్నా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో 13.3 కోట్ల ఓట్లను తొలగించారని ఈ రాష్ట్రంలో సుమారు 45 లక్షల తొలగించిన వాటిలో ఉన్నవని జ్ఞానేశ్ కుమారు బిజెపికి ఆర్ఎస్ఎస్ కు తొత్తుగావ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పేదలు, నిరుపేదలు వలస కార్మికులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఓట్లను తొలగించి హిందువుల ఓటర్లుగా గుర్తింపు చేస్తున్నారని ఇది చాలా దుర్మార్గం అన్నారు.

ముగ్గురు కమిటీ సభ్యులు ఉండగా మెజార్టీ సలహాను తీసుకోకుండా జ్ఞానేష్ కుమార్ సొంత నిర్ణయాలతో తొలగిస్తున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ కామన మునిస్వామి, మండల కమిటీ సభ్యులు జుత్తిగ రామాంజనేయులు, బొంతు నాగబాబు, గుబ్బల ముత్యాలు, పిల్లి కోటేశ్వరరావు, పిల్లి ఏడుకొండలు, పి. పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)