Palakollu: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలి: పాలకొల్లులో సీపీఎం ధర్నా!

Palakollu: కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు.

S VENKAT, PALAKOLLU
Published on: 11 Oct 2026 10:21 PM IST
Palakollu
X

Palakollu: సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను వెంటనే తొలగించాలి: పాలకొల్లులో సీపీఎం ధర్నా!

పాలకొల్లు: ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలని దేశ్యప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలను అణచివే యాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలు దుర్మార్గమని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎ రవి విమర్శించారు. స్థానిక ఆర్ వి సుబ్బారావు ఆసుపత్రి సెంటర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు.

ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ శనివారము ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలను సహించలేని ప్రభుత్వం అనేక రకాల నిర్బంధాలు ఉపయోగించినప్పటికీ లక్షలాది ప్రజానీకం అనేక రకాలుగా నిరసన తెలియజేశారు నిరసన కారులను ఎన్ని రకాలుగా నిర్భందించిన వెనుతిరగా లేదు ప్రభుత్వం వెంటనే ఎన్నికల షిప్ కమిషనర్ను ఆ పదవి నుండి తొలగించాలని,

తొలగించిన ఓట్లను తిరిగి చేర్చాలని ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎన్నికల షీప్ కమిషనర్ను తొలగించుకుంటే ఉద్యమాలు ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బీజార్జి నాయకులు రావు గుబ్బల సత్యనారాయణ ఏకల రాము తిరుమని శ్రీను ఏ శ్యామల రాణి దొండపాటి రోజా మని ఎస్ పురుషోత్తము ఏ నారాయణమ్మ ఏకేవీ రామబద్రం చల్ల వీరభద్రుడు బొప్పే శంకర్ రావు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

S VENKAT, PALAKOLLU

S VENKAT, PALAKOLLU