Polavaram: పోలవరం క్రీడాభివృద్ధికి శాప్ డైరెక్టర్ కీలక అడుగులు!

Polavaram: ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గంలో క్రీడల అభివృద్ధికి శాప్ డైరెక్టర్ కొవ్వాసి జగదీశ్వరి కీలక అడుగులు వేశారు.

V RANJITH KUMAR, POLAVARAM
Published on: 4 July 2026 3:35 PM IST
Polavaram
X

Polavaram: పోలవరం క్రీడాభివృద్ధికి శాప్ డైరెక్టర్ కీలక అడుగులు!

పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం క్రీడాభివృద్ధికి కీలక అడుగులు పడ్డాయి శాప్ ఎండి ని కలిసి ప్రత్యేక వినతి పత్రాన్ని ఆంధ్రప్రదేశ్ శాప్ డైరెక్టర్ కొవ్వాసి జగదీశ్వరి అందజేశారు.

పోలవరం నియోజకవర్గం లోని క్రీడలను ప్రోత్సహించే విధంగా విద్యార్థులను క్రీడలపై మొక్కువ చూపే విధంగా వారికి క్రీడా అవసరాలను సమకూర్చాలని వారి క్రీడల్లో రాణించడానికి ప్రోత్సహించాలని ఐటీడీఏ మరియు కన్నాపురం ప్రాంతాల్లో ఇండోర్ స్టేడియంలు త్వరితగతిన నిర్మించాలని...

మా ఏజెన్సీలో క్రీడలకు పెద్దపీట వేయాలని జీలుగుమిల్లిలోని క్రీడా వికాస కేంద్రం, ద్వారా క్రీడాకారులకు మంచి సువర్ణ అవకాశాన్ని చేకూర్చాలని ఆధునిక క్రీడా సామాగ్రిని అందుబాటులోకి తేవాలని తద్వారా క్రీడాకారులు మరింత గా క్రీడల్లో రాణిస్తారని పోలవరం నియోజకవర్గం లోని చాలామంది క్రీడాకారులు గుర్తింపు లేక వారి క్రీడలు ఆ ప్రాంతాలకే పరిమితం అవుతున్నాయని...

అటువంటి క్రీడాకారులకు ప్రోత్సహించేందుకు ఆధునిక సదుపాయాలు అందిస్తే రాష్ట్రమే కాదు దేశంలో కూడా రాణించే విధంగా తర్ఫీదు నిస్తే మన దేశ మువ్వన్నెల జెండా ఇతర దేశాల్లో ఎగిరే విధంగా మన క్రీడాకారులు తెస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటూ శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి ఎండి భరణిని కోరారు.

V RANJITH KUMAR, POLAVARAM

V RANJITH KUMAR, POLAVARAM

Next Story