Iragavaram: రేలంగి నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్!
Iragavaram: ఇరగవరం మండలం రేలంగిలోని నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని బుధవారం పరిశీలించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పారదర్శకంగా ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు.
Iragavaram: రేలంగి నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్!
Iragavaram: నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదేశించారు. ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని బుధవారం ఆమే పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ విధానం, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో రిటెర్నింగ్ ఆధికారి కె.వి.వి. సత్యనారాయణ,ఇరగవరం మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఎ. శ్రీనివాసు, తహశీల్దార్ ఎమ్ సుందర్రాజు తదితరులు పాల్గొన్నారు.




