Tanuku: ఉపాధి రక్షణ కోసం దస్తావేజు లేఖరుల పోరాటం ఆఫీస్ల వద్ద దీక్షలు!

Tanuku: తణుకు, సజ్జాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఎదుట రిజిస్ట్రేషన్ల శాఖ ప్రైవేటీకరణను నిరసిస్తూ దస్తావేజు లేఖరులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 20 July 2026 8:32 PM IST
Tanuku
X

Tanuku: ఉపాధి రక్షణ కోసం దస్తావేజు లేఖరుల పోరాటం ఆఫీస్ల వద్ద దీక్షలు!

తణుకు: ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేసే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖర్ల సంక్షేమ సంఘ తణుకు అధ్యక్షుడు పిఎల్ శ్రీనివాస్ కోరారు. తణుకు, సజ్జాపురం సబ్ రిజిస్టర్, కార్యాలయాల వద్ద దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు.

ఈ సందర్భంగా దస్తావేజు లేఖర్ల సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖను ప్రైవేటీకరణ చేస్తూ, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేస్తూ 396 జీవోను జారీ చేసిందని తెలిపారు. దీనివల్ల దస్తావేజు లేఖర్లు, స్టాంప్ వెండర్లు జీవనోపాధి కోల్పోతారని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ ఆఫీసులను ప్రైవేటీకరణ చేస్తే మేమంతా ఉపాధి కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు పెట్టడం ద్వారా ప్రజల ఆస్తులకు భద్రత ఉండదని వారి ఆస్తులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినట్లు అవుతుందని రిజిస్ట్రేషన్ ఆఫీసులను ప్రైవేటు పరం చేసే నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని సూచించారు.

396 జీవో ను వెంటనే రద్దుచేసి దస్తావేజు లేకరులకు లైసెన్సులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘ గౌరవ అధ్యక్షుడు అల్లూరి సూర్యనారాయణ రాజు, కార్యదర్శి బోడ నాగబాబు, సంఘ తణుకు సజ్జాపురం నాయకులు చామంతి శ్రీనివాసరావు, మండపాక సూర్య వెంకట భాస్కర్,తూల పోతురాజు, కామర్సు ప్రసాద్, సిహెచ్ ఎస్ఎన్ రమేష్, డీటీపీ ఆపరేటర్లు, స్టాంప్ వెండర్స్ పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story