Penugonda: సిద్ధాంతం మోడల్ ప్రైమరీ స్కూల్‌లో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

Penugonda: పెనుగొండ మండలం సిద్ధాంతం పాఠశాలలో దాత సత్య ప్రియురాం ఆర్థిక సాయంతో స్టీల్ సామగ్రి పంపిణీ. ప్రైవేట్ నుండి ప్రభుత్వ బడికి పెరిగిన చేరికలు.

E.ABRAHAM, ACHANTA
Published on: 1 July 2026 9:24 PM IST
Penugonda
X

Penugonda: సిద్ధాంతం మోడల్ ప్రైమరీ స్కూల్‌లో విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసుల పంపిణీ

వాసవి పెనుగొండ: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్యార్థుల ప్రగతికి దాతలు అందిస్తున్న సహకారం ఎంతో ప్రశంసనీయమని పెనుగొండ మండలం, సిద్ధాంతం మోడల్ ప్రైమరీ స్కూల్ (రెగ్యులర్) ప్రధానోపాధ్యాయుడు ఎం. రవీంద్రనాథ్ కుమార్ అన్నారు.

పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న సుమారు 85 మంది విద్యార్థులకు దేవ హైస్కూల్ ప్రధానోపాధ్యాయుడు వి. సత్య ప్రియురాం ఆర్థిక సహకారంతో స్టీల్ ప్లేట్లు, గ్లాసులను అందజేశారు. ఈ సామగ్రిని పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్‌పర్సన్ కె. సంధ్య చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా దాత వి. సత్య ప్రియురాంను మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ-1 డి. సుభాకరరావు, ఎంఈఓ-2 పి. రామకృష్ణ అభినందించి, ప్రభుత్వ పాఠశాలలకు దాతలు ముందుకు రావడం ఆదర్శనీయమని కొనియాడారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు ఎం. రవీంద్రనాథ్ కుమార్ మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో వివిధ ప్రైవేట్ పాఠశాలల నుంచి 30 మంది విద్యార్థులు తమ పాఠశాలలో చేరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో విద్యార్థుల విద్యాభివృద్ధి, హాజరు, పాఠశాల అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story