Tanuku: మాజీ మంత్రి కారుమూరి నివాసంలో ఈడీ సోదాలు

Tanuku: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హైదరాబాద్ నివాసంలో ఈడీ (ED) అధికారులు సోదాలు నిర్వహించారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 11 Jun 2026 5:05 PM IST
Tanuku
X

Tanuku: మాజీ మంత్రి కారుమూరి నివాసంలో ఈడీ సోదాలు

Tanuku: మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు హైదరాబాద్ నివాసంలో గురువారం ఉదయం ఈడీ సోదాలు నిర్వహించిందని, ఈ సందర్భంగా తమ కుటుంబం ఆయన కుమారుడు కారుమూరి సునీల్ కుమార్ భారతదేశచట్టాలను,న్యాయస్థానాలను గౌరవిస్తూ అధికారులకు పూర్తిగా సహకరించమని ఆయన అన్నారు.

తణుకులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన, తాము ఎప్పుడూ ఎలాంటి తప్పు చేయలేదని, తప్పును సమర్థించలేదని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల తరఫున గళమెత్తుతున్న వైఎస్సార్‌సీపీ నాయకులను అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

ఈడీ అయినా, సిట్ అయినా దర్యాప్తు సంస్థలకు తాము ఎల్లప్పుడూ సహకరిస్తూనే ఉంటామని కారుమూరి పేర్కొన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు నిర్వహిస్తున్న "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తణుకులో భారీ నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నెల 12న ఉదయం 8.30 ఆర్ట్స్ కళాశాల నుంచి నరేంద్ర సెంటర్ వరకు జరిగే ఈ ర్యాలీకి తణుకు నియోజకవర్గ ప్రజలు, మహిళలు, పార్టీ శ్రేణులు, మూడు మండలాల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.

కూటమి ప్రభుత్వ అరాచకాలు, దోపిడీలపై ప్రజలు గళమెత్తాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలందరూ కలిసికట్టుగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story