Tanuku: తణుకు విరంచి స్కూల్‌లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు!

Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు విరంచి స్కూల్‌లో ఘనంగా ఇంజనీర్స్ డే.. విద్యుత్ శాఖ అధికారులకు సన్మానం, మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు నివాళులు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 15 Sept 2026 5:35 PM IST
Tanuku
X

Tanuku: తణుకు విరంచి స్కూల్‌లో ఘనంగా ఇంజనీర్స్ డే వేడుకలు!

Tanuku: తారకాపురి లైన్స్ క్లబ్ ప్రెసిడెంట్ బెజవాడ రామసూర్య ఆధ్వర్యంలో స్థానిక విరంచి స్కూల్ లో ఇంజనీర్స్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ డీఈ భూపతి దివాకరరావు, ఏఈ బండారు నరసింహమూర్తి లను ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వావిలాల సరళాదేవి‌ మాట్లాడుతూ లైనిజంలో అనేక సేవలతో పాటుగా దేశాన్ని ఎప్పటికప్పటి రక్షించే ఇంజనీర్లని సత్కరించుకునే మంచి సంప్రదాయం

ఉండటం ఆభినందనియమన్నారు. తొలుత మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయన జీవిత చరిత్రని, ఇంజనీర్స్ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో స్కూల్ సెక్రెటరీ కెఎన్వి రాంకుమార్,స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మి,రమేష్ గుప్తా,బత్తుల రమణ, కే శ్యామల, ఎన్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)