Tuni:తునిలో ఓటరు జాబితా సవరణ అధికారులకు కీలక ఆదేశాలు!
Tuni: తుని నియోజకవర్గంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియపై ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) ఎన్. శ్రీధర్ ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు
Tuni:తునిలో ఓటరు జాబితా సవరణ అధికారులకు కీలక ఆదేశాలు!
తుని: తుని నియోజకవర్గ పరిధిలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (Special Summary Revision - SIR) ప్రక్రియను పటిష్టంగా నిర్వహించేందుకు నియోజకవర్గ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (ERO) ఎన్. శ్రీధర్ గారు ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో తుని, కొత్తనందూరు, తొండంగి మండలాల తహసీల్దార్లు మరియు తుని మున్సిపల్ కమిషనర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ERO మాట్లాడుతూ, ఓటరు జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లను నమోదు చేయడంతో పాటు, సవరణలను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో బూత్ స్థాయి అధికారులు (BLOలు) నిర్వహిస్తున్న సర్వేలు, దరఖాస్తుల పరిశీలనపై ఆయన ఆరా తీశారు.
ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూడాలని, పారదర్శకతతో ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు తమ పరిధిలో జరుగుతున్న నమో దు ప్రక్రియ పురోగతిని EROకు వివరించారు




