Etapaka: ఎటపాక జెడ్పీటీసీ బరిలో ఏసీ గుర్తుతో ఉబ్బా సుస్మిత
Etapaka: ఎటపాక జెడ్పీటీసీ ఎన్నికల్లో సాంకేతిక కారణాలతో గ్లాస్ గుర్తు దక్కకపోయినా కూటమి అభ్యర్థిని ఉబ్బా సుస్మిత ఏసీ గుర్తుతో స్వతంత్రంగా ముమ్మర ప్రచారం చేస్తున్నారు.
Etapaka: ఎటపాక జెడ్పీటీసీ బరిలో ఏసీ గుర్తుతో ఉబ్బా సుస్మిత
ఎటపాక: ఎటపాక జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. జనసేన పార్టీ బీ-ఫామ్ ఇచ్చినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన కూటమి జెడ్పీటీసీ అభ్యర్థి ఉబ్బా సుస్మిత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
జనసేన పార్టీ తరపున బీ-ఫామ్ తెచ్చుకున్నప్పటికీ, ముందుగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయడం వల్ల అధికారులు జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును కేటాయించలేదు. దీంతో అధికారులు ఆమెకు ఎయిర్ కండిషనర్ (AC) గుర్తును కేటాయించారు.కూటమిలో ఒక వర్గం మద్దతు లేకపోయినప్పటికీ, సుస్మిత సొంతంగా ప్రజల్లోకి వెళ్లి విస్తృ
తంగా ప్రచారం చేస్తున్నారు. ప్రజల నుంచి విశేష మద్దతు, మన్ననలు పొందుతున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని, తన ఎన్నికల గుర్తు ఎయిర్ కండిషనర్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నారు.
తనను జెడ్పీటీసీగా గెలిపిస్తే మండలంలో ప్రధాన సమస్యలైన మంచినీటి సౌకర్యం కల్పన, అంతర్గత రహదారుల నిర్మాణం, పారిశుద్ధ్యం, పరిశుభ్రత, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం వంటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటంతో నిధులు తెచ్చి ఎటపాక మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఆమె ప్రజలకు వివరిస్తున్నారు.ప్రస్తుతం ఆమె ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.




