West Godavari: నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం.. ఆచంట సబ్ రిజిస్టర్ సవాల్!

West Godavari: ఆచంట సబ్ రిజిస్టర్ కార్యాలయంపై వస్తున్న అసత్య ఆరోపణలను ఖండించిన సబ్ రిజిస్టర్ జగన్.

E.ABRAHAM, ACHANTA
Published on: 28 April 2026 1:50 PM IST
West Godavari
X

West Godavari: నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం.. ఆచంట సబ్ రిజిస్టర్ సవాల్!

West Godavari: ఆచంట సబ్ రిజిస్టర్ కార్యాలయం ఆచంట సబ్ రిజిస్టర్ కార్యాలయ పనితీరు, రిజిస్ట్రేషన్ ప్రక్రియలపై పత్రిక చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండించిన ఆచంట సబ్‌ రిజిస్ట్రార్‌ జగన్. పులపా హరిబాబు, పత్రిక విలేఖరి విజయవాడ రీజినల్ మేనేజర్ లక్ష రూపాయలు ఇవ్వాలని బ్లాక్మెయిల్ చేయడాని ఖండించి అతనిపై చట్ట పరమైన చర్యలకు సిద్ధమంటున్న ఆచంట సబ్ రిజిస్టర్. అడిగిన డబ్బులు ఇవ్వలేదని కక్షపూరితంగా నాపై అసత్య ఆరోపణలు ప్రచారాలను చేస్తున్నారు ఇది సమంజసం కాదు అవకతవకలు జరిగితే నిరూపించండి.. సబ్ రిజిస్టర్.

వాస్తవాలను తెలుసు కోకుండా నన్ను జగ్గు భాయి , జగ్గు అనే దోరణితో వక్రీకరించి కదనాలు వ్రాయడం చాలా బాధాకరం, నా వ్యక్తిత్వాన్ని కించపరచడం సబబు కాదు ఆధారాలు లేకుండా, నిరాధారణ వార్తలను ప్రచురించి ప్రజలను తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారలు చేయడం కరెక్ట్ కాదు కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే పార్టీ వ్యక్తులు కానీ ఒక్కరినీ డబ్బులు డిమాండ్ చెయ్యలేదు, పారదర్శకంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.

ఎనీవేర్ డాక్యుమెంట్లు" విధానానికి రాష్ట్రంలో మంచి స్పందన ఉంది.పార్టీలు ఇబ్బంది పడకుండా ఈ సేవ ద్వారా పౌరులు ఒక ప్రాంతంలో ఉండి వేరొక ప్రాంతంలో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రభుత్వం కల్పించింది. నేను అప్రూవల్ ఇచ్చేటప్పుడు ఒకటికి రెండు సార్లు అప్రూవల్ సరిచూసుకునిఇవ్వడం జరుగుతుంది. నేను రిజిస్ట్రేషన్ చేసిన దస్తావేజులలో ఎక్కడైనా తప్పుడు దస్తావేజులు( డాక్యుమెంట్స్) ఉంటే నిరూపించండి. నేను ఒక ట్రైబల్ కులానికి చెందిన వాడను, కాబట్టి నాపై అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదు ఏవైనా సందేహాలు ఉంటే నేరుగా కార్యాలయాన్నికి వచ్చి సంప్రదించండి.. నాపై అవస్తవాలను ప్రసారం చేసిన వ్యక్తులపై జిల్లా ఎస్పీ, ఎస్సీ ఎస్టీ కమిషన్ తో సహా ఫిర్యాదు చేసి నిజ నిజాలను వెలిగి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను.. ఆచంట సబ్ రిజిస్టర్ జగన్.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story