Gangavaram: గంగవరం మండలంలో గ్రామంలోకి వచ్చిన జింకకు అటవీ శాఖ చికిత్స
Gangavaram: గంగవరం మండలం మొల్లేరు గ్రామంలో కుక్కల దాడిలో గాయపడిన జింకకు అటవీ అధికారుల చికిత్స. కోలుకున్నాక తిరిగి అడవిలోకి విడిచిపెట్టనున్నట్లు వెల్లడి.
Gangavaram: గంగవరం మండలంలో గ్రామంలోకి వచ్చిన జింకకు అటవీ శాఖ చికిత్స
గంగవరం: గంగవరం మండలం మొల్లేరు గ్రామంలో ఓ జింక ప్రత్యక్షమై స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. అడవిలో కుక్కల దాడికి గురై స్వల్ప గాయాలతో గ్రామంలోకి వచ్చిన జింకను గ్రామస్థులు అప్రమత్తంగా పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.
జింక భయాందోళనకు గురికాకుండా ఉండేందుకు అటవీ అధికారులు దాని కళ్లకు గంతలు కట్టి ప్రాథమిక చికిత్స అందించారు. గాయాలకు అవసరమైన వైద్యం చేసి, పూర్తిగా కోలుకున్న అనంతరం తిరిగి సహజ ఆవాసమైన అడవిలో విడిచిపెడతామని అటవీ శాఖ అధికారులు తెలిపారు.
గ్రామస్థులు సమయస్ఫూర్తితో స్పందించి జింకను సురక్షితంగా అటవీ శాఖకు అప్పగించడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా నివారించగలిగారు.
Next Story




