Penumantra: మార్టేరు మాజీ సర్పంచ్ మట్టా కుమారికి "గౌరవ" డాక్టరేట్
Penumantra: పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు మాజీ సర్పంచ్, సామాజిక కార్యకర్త మట్టా కుమారికి ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ గౌరవ డాక్టరేట్ ప్రకటించింది.
Penumantra: మార్టేరు మాజీ సర్పంచ్ మట్టా కుమారికి "గౌరవ" డాక్టరేట్
Penumantra: మార్టేరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, సామాజిక సేవాకారిణి "మట్టా కుమారికి" ప్రతిష్ఠాత్మక "గౌరవ" డాక్టరేట్" లభించడం పట్ల మార్టేరు గ్రామంలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది. సమాజా భివృద్ధికి, గ్రామ ప్రగతికి ఆమె అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ ఇంటర్నేషనల్ మనం ఫౌండేషన్ గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు డా. కె. చక్రవర్తి తెలిపారు.
హైదరాబాద్‌లోని చిక్కడపల్లి శ్రీ త్యాగరాయ గానసభ కళా దీక్షితులు హాల్లో నిర్వహించనున్న సంస్థ వార్షికోత్సవ వేడుకల్లో ఈ గౌరవ డాక్టరేట్‌తో పాటు 'మనం పద్మచక్ర సేవారత్న' అవార్డును కూడా ప్రముఖుల చేతుల మీదుగా మట్టా కుమారికి ప్రదానం చేయనున్నట్లు వెల్లడించారు.
మార్టేరు గ్రామపంచాయతీ సర్పంచ్‌గా పనిచేసిన కాలంలో గ్రామాభివృద్ధికి విశేష కృషి చేసి ప్రజల మన్ననలు పొందిన మట్టా కుమారి, పారిశుద్ధ్యం, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజాసేవలో తనదైన ముద్ర వేసిన విద్యావంతురాలైన నాయకురాలిగా గుర్తింపు పొందారు. ఆమె సేవలకు గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం లభించడం గ్రామ ప్రజలకు గర్వకారణమని పలువురు పేర్కొన్నారు.
మట్టా కుమారికి గౌరవ డాక్టరేట్ రావడం పట్ల
మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యురాలు కర్రీ గౌరీ సుభాషిణి, మార్టేరు మాజీ ఉప సర్పంచ్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు కర్రీ వేణుబాబు, మాజీ ఉపసర్పంచ్ మట్టా సదానందరావు, కుటుంబ సభ్యులు, ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఆచంట వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు అభిమానులు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు అభినందనలు తెలిపారు.




