Poduru: పోడూరులో వైఎస్సార్‌సీపీ నేతలకు గుర్తింపు కార్డుల పంపిణీ!
Poduru: పోడూరు మండలం తూర్పుపాలెంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, అనుబంధ సంఘాల ప్రతినిధులకు మాజీ మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథరాజు గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు.
Poduru: పోడూరులో వైఎస్సార్‌సీపీ నేతలకు గుర్తింపు కార్డుల పంపిణీ!
పోడూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర మాజీ మంత్రి పి.ఏ.సి సభ్యులు చెరుకువాడ శ్రీ రంగనాథరాజు ఆధ్వర్యంలో పోడూరు మండలం తూర్పు పాలెం పార్టీ కార్యాలయంలో ఆచంట నియోజకవర్గం లోని పోడూరు మరియు ఆచంట మండలాల సంబంధించి వైసిపి పార్టీ పదవులు వివిధ హోదా కలిగిన అనుబంధ సంఘాల నాయకులకు ఐడెంటి కార్డులను ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి నరసాపురం పార్లమెంట్ ఇంచార్జ్,గూడూరు ఉమా బాల ఆచంట నియోజకవర్గ ఇన్చార్జి మేడపాటి షర్మిలా రెడ్డి పోడూరు మండలం మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు సుమంగళి మండల పార్టీ కన్వీనర్ పిల్లి నాగన్న ఆచంట మండల పార్టీ కన్వీనర్ జక్కంశెట్టి శ్రీరాములు గుబ్బల వీర బ్రహ్మం పోతుముడి రామచంద్రరావుతదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.




