Achanta: ఆచంటలో ఇసుక మాఫియాకు అధికారుల అండ

Achanta: పశ్చిమగోదావరి జిల్లా లోని నడిపూడి ఇసుక ర్యాంపు నుండి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆరోపించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 15 Jun 2026 9:35 PM IST
Achanta
X

Achanta: ఆచంటలో ఇసుక మాఫియాకు అధికారుల అండ

Achanta: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం లో నడిపూడి ఇసుక ర్యాంపు నుండి ఎ విధమైన అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారని మాజీ మంత్రివర్యులు చెరుకువాడ శ్రీరంగనాధరాజు ఆరోపించారు.

సోమవారం నడిపూడి లో అక్రమ ఇసుక తరలిస్తున్న ర్యాంపు ను స్వయంగా అయన పరిశీలించారు, అనంతరం ఆయన మాట్లాడుతూ.. హై కోర్టు లో పిల్ ఉన్నా కలెక్టర్ ఆదేశాలు సైతం లెక్కచేయకుండా యాడెచ్చగా ఇసుక తరలిస్తున్నారని అన్నారు.

ఆచంట నియోజకవర్గంలో ఉన్న ఇంతా దారుణం గా అక్రమంగా ఇసుక తరలిస్తున్నా కనీసం అధికారులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని విమర్శించారు, ప్రజా సమస్యలు గాలికొదిలేచి ప్రజాధనం దోచేయడమే లక్ష్యంగా పని చేస్తున్నారని అన్నారు.

అధికారులు సైతం అడ్డగోలుగా అక్రమాలకు అండగా ఉంటున్నారని తెలిపారు, రాత్రులు దొంగతనంగా ఇసుక తరలింపుకు స్థానిక అధికార పార్టీ నేతలు కొమ్ము కాస్తున్నారని అన్నారు, అక్రమ ఇసుక తరలింపుపై పోరాటం చేస్తే వారిపై అక్రమ కేసులు పెట్టి రాజకీయం గా వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు,

ర్యాంపుకు పరిశీలించిన వారిలో వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గున్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story