Tanuku: వేల్పూరు మాజీ సర్పంచి దత్తుడు మృతి!

Tanuku: తణుకు మండలం వేల్పూరు మాజీ సర్పంచి పెనుమర్తి సోమసూర్యచంద్రరావు (దత్తుడు) మృతి చెందారు. ఆయన అంతిమయాత్రలో ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ పాల్గొని పాడెమోశారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 7 Oct 2026 4:36 PM IST
Tanuku
X

Tanuku: వేల్పూరు మాజీ సర్పంచి దత్తుడు మృతి!

Tanuku: తణుకు మండలం వేల్పూరు గ్రామ మాజీ సర్పంచి, మాజీ సొసైటీ అధ్యక్షుడు పెనుమర్తి సోమసూర్యచంద్రరావు (దత్తుడు) (70) మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు కుమార్తె మాధురి అమెరికాలో ఉండగా, కుమారులు మోహన్, గోపీలు స్థానికంగా పౌల్ట్రీ పరిశ్రమ నిర్వహిస్తున్నారు. ఉన్నారు. ఆయన సతీమణి వెంకటలక్ష్మి గ్రామ సర్పంచిగా పనిచేశారు. ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణకు స్వయాన ఆయన చిన్నాన్న.

సర్పంచిగా దత్తుడు గ్రామ అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిది దత్తుడు వేల్పూరులో 1995 నుంచి 2001 వరకు సొసైటీ ప్రెసిడెంట్‌గా, 2001 నుంచి 2006 వరకు గ్రామ సర్పంచిగా, 2006 నుంచి 2011 వరకు మరోసారి గ్రామ సర్పంచ్‌గా ఎన్నికై సేవలందించారు, గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిది.

దత్తుడికి తుది వీడ్కోలు..

దత్తుడి మృతి సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రాధాకృష్ణ అయన నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం దత్తుడు పార్థివదేహాన్ని పాడెమోస్తూ స్మశాన వాటిక వరకు అంతిమయాత్రలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని తుది వీడ్కోలు పలికారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సర్పంచ్‌గా, సొసైటీ అధ్యక్షుడిగా పనిచేసిన కాలంలో గ్రామ అభివృద్ధికి ఆయన చేసిన కృషి, ప్రజా సమస్యల పరిష్కారానికి అందించిన సహకారం చిరస్మరణీయమని పేర్కొన్నారు.

ప్రజలతో సన్నిహితంగా మెలుగుతూ అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిగా దత్తుడు ప్రత్యేక గుర్తింపు పొందారని తెలిపారు.ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలియజేస్తూ, దత్తుడు పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, భగవంతుడు ఆయన కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

దత్తుడి అంతిమయాత్రలో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్, మాజీ మంత్రి చేరుకువాడ రంగనాథ రాజు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, మాజీ ఎమ్మెల్యే ముళ్లపూడి వెంకట కృష్ణరావు,అత్తిలి ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్,మాజీ మున్సిపల్ చైర్మన్లు డా.దొమేటి సుధాకర్,పరిమి వెంకన్న బాబు, బలగం సీతారామయ్య ,మాజీ ఏఎంసీ చైర్మన్ బసవ రామకృష్ణ,పలువురు ప్రముఖులు ,పారిశ్రామికవేత్తలు,తణుకు నియోజకవర్గంలో వివిధ గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)