Siddhantham: సిద్ధాంతం గోదావరి చెంత అద్భుత దృశ్యం.. వైభవంగా పంచ హారతులు!

Siddhantham: పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం సిద్ధాంతం వశిష్ట గోదావరి వద్ద ఏరువాక పౌర్ణమి సందర్భంగా గోదావరి మాతకు ‘పంచ హారతులు’ వైభవంగా నిర్వహించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 29 Jun 2026 8:42 PM IST
Siddhantham
X

Siddhantham: సిద్ధాంతం గోదావరి చెంత అద్భుత దృశ్యం.. వైభవంగా పంచ హారతులు!

Siddhantham: పెనుగొండ మండలం, సిద్ధాంతం వశిష్ట గోదావరి వద్ద ఏరువాక పౌర్ణమి సందర్భముగా సోమవారం రాత్రి సిద్ధాంతం హిందూ ధర్మ పరిరక్షణ సమితి వారి ఆధ్వర్యంలో కలగ భద్రుడు స్వామి బ్రహ్మాత్వంలో కంచర్ల నరసింహమూర్తి, శ్రీమతి మహాలక్ష్మి దంపతులచే గోదావరి మాతకు "పంచ హారతులు" అతి వైభవంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏకముక, ద్విముఖ, చతుర్ధ, పంచమ, కుంభ, నక్షత్ర, పూర్ణ, కుంభ, సర్ప, హారతులు వశిష్ట గోదావరికి వేద పండితుల సమక్షంలో ఈ హారతుల కార్యక్రమం కొనుల పండుగ చేశారు.

నదీమతల్లులను ఆరాధించడం అనాదిగా వస్తున్న మన సంప్రదాయమని తెలిపారు. ఈరోజు గోదావరి నదీమ తల్లికి సంధ్యాహారతిని ఇవ్వటం జరిగిందని హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు తెలియజేసారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story