Gopalapuram: గోపాలపురంలో చరిత్ర సృష్టించిన కూటమి విజయం!
Gopalapuram: గోపాలపురం నియోజకవర్గంలో చరిత్ర సృష్టించిన కూటమి విజయం. తొలిసారిగా రెండు ఎంపీటీసీ స్థానాలను భారీ మెజారిటీతో కైవసం చేసుకున్న అభ్యర్థులు.
Gopalapuram: గోపాలపురంలో చరిత్ర సృష్టించిన కూటమి అభ్యర్థుల ఘన విజయం!
Gopalapuram: గోపాలపురం అభివృద్ధికి ఎమ్మెల్యే బండారు చేస్తున్న కృషికి పట్టం కట్టిన గ్రామ ప్రజలు. తన సొంత గ్రామం వాడపాలెం మాదిరిగానే గోపాలపురాన్ని అభివృద్ధి చేస్తానని మాట ఇచ్చి వెనక్కి తగ్గకుండా గోపాలపురం అభివృద్ధికి కోట్లాది రూపాయలను కేటాయించి, గ్రామ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు ఆ గ్రామ ప్రజలు గొప్ప బహుమతిని అందజేశారు. చరిత్రలో తొలిసారిగా గ్రామంలోని రెండు ఎంపీటీసీ స్థానాలను కూటమి అభ్యర్థులు గెలుచుకున్నారు.
గత చరిత్రను తిరగరాస్తూ భారీ మెజారిటీలతో కూటమి అభ్యర్థులు గోపాలపురం ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవడంతో సర్వత్ర హర్షం వ్యక్తమౌతుంది. ఎమ్మెల్యే బండారు నిరంతర కృషి, కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రజల్లో విస్తృత ఆదరణ పొందాయని ఈ ఫలితాల ద్వారా అర్థమవుతుంది. ఎమ్మెల్యే బండారు సత్యానందరావుకు గోపాలపురం ప్రజలు దీపావళి కానుకను అందజేశారని స్థానిక నాయకులు వ్యాఖ్యానిస్తూ ఉండడం విశేషం.




