Tanuku: తణుకులో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు!

Tanuku: పశ్చిమగోదావరి జిల్లా తణుకులో 'ఆంధ్ర కేసరి' టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. హౌసింగ్ బోర్డ్ కాలనీలోని ఆయన విగ్రహానికి

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 23 Aug 2026 3:17 PM IST
Tanuku
X

Tanuku: తణుకులో ఘనంగా టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు!

Tanuku: స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటీషు వారికి ఎదురొడ్డి పోరాడిన ధీరుడు "ఆంధ్ర కేసరి" టంగుటూరి ప్రకాశం పంతులు అని రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఆనందం మస్తాన్ రావు అన్నారు. "ఆంధ్ర కేసరి" టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని స్థానిక హౌసింగ్ బోర్డ్ కాలనీ మున్సిపల్ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి ఆదివారం పూల మాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అప్పటి మద్రాసు నగరంలో బ్రిటీషు వారిపై తిరబడి, సైమన్ కమిషన్ ను ఎదిరించి, "సైమన్ గో బ్యాక్" అని నినదించి, బ్రిటీషు పోలీసుల తుపాకీలకు తన గుండె చూపించి తనను కాల్చమని గర్జించిన సింహం "ఆంధ్ర కేసరి" అని కొనియాడారు.

న్యాయవాద వృత్తిలో తాను సంపాదించిన యావదాస్తిని స్వాతంత్ర్య పోరాటం కోసం ఖర్చు చేసిన నిష్కళంక దేశ భక్తుడు, స్వాతంత్ర్య సమరయోధుడు ప్రకాశం పంతులు అన్నారు. ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రానికి విశేష సేవలు అందించారని ఆయన వివరించారు.

కార్యక్రమంలో సినీ క్యారెక్టర్ ఆర్టిస్ట్, గేయ రచయిత కోట రామప్రసాద్, అంబేద్కర్ భవన వ్యవస్థాపకుడు కొండే నాగేశ్వరరావు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కోడూరి ఆంజనేయులు, తెదేపా నరసాపురం పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షుడు తమరాపు సత్యనారాయణ,

తణుకు లయన్స్ క్లబ్ మాజీ అధ్యక్షులు చీకటి శ్రీనివాసరావు, న్యాయవాదులు కౌరు వెంకటేశ్వర్లు,అనుకుల రమేష్, విశ్రాంత ఎస్.ఐ. బోడపాటి ప్రసాద్, ప్రముఖ వైద్యుడు దాట్ల సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story