Poduru: పోడూరులో శాస్త్రోక్తంగా జైన్ దేవాలయ నిర్మాణ శంకుస్థాపన!

Poduru: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరులో నూతన జైన్ దేవాలయ నిర్మాణానికి శాస్త్రోక్తంగా శంకుస్థాపన నిర్వహించారు.

E.ABRAHAM, ACHANTA
Published on: 19 Aug 2026 11:11 PM IST
Poduru
X

Poduru: పోడూరులో శాస్త్రోక్తంగా జైన్ దేవాలయ నిర్మాణ శంకుస్థాపన!

పోడూరు: పోడూరు మండల కేంద్రమైన పోడూరులో జైన్ దేవాలయ నిర్మాణం బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శాస్త్రోత్తంగా అత్యంత ఘనంగా నిర్వహించారు.

ఆచంటకు చెందిన పద్మప్రభూస్వామి జైన్ దేవాలయం ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ఆశీస్సులతో పూజాధి కార్యక్రమాలు నిర్వహించారు.ఈ దేవాలయం శీతలనాధ్ జైన్ సంఘం పిఠాపురం వారి ఆర్ధిక సహాయంతో నిర్మించనున్నారు. ఈ శంఖుస్థాపన కార్యక్రమానికి పోడూరు పరిసర గ్రామాల ప్రజలు విచ్చేసి జైన్ దేవుని (సుమతినాధ్) మరియు గురువుల ఆశీస్సులు పొందారు.

కార్యక్రమంలో టిడిపి పోడూరు మండల అధ్యక్షుడు రుద్రరాజు రమేష్ రాజు, పోడూరు నీటి సంఘం మాజీ అధ్యక్షుడు రుద్రరాజు వరహాలరాజు, రుద్రరాజు శివరామరాజు (శివ), పోడూరు సొసైటీ మాజీ అధ్యక్షుడు చేకూరి సూర్యనారాయణరాజు (సూరిబాబు), వైద్యులు పోడూరు కృష్ణమూర్తి, మాజీ సర్పంచ్ శెట్టిబత్తుల సువర్ణ రాజు, ఆచంట ఏఎంసి డైరెక్టర్ బండి సత్యనారాయణ, పోడూరు సొసైటీ త్రీసభ్య కమిటీ సభ్యుడు తోలేటి వేణు, రాయుడు సుబ్బారావు ముప్పన సూర్యనారాయణ, గ్రామస్తులు, జైన్ దేవుని భక్తులు తదితరులు పాల్గొన్నారు.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story