Poduru: ఎంపీపీ లక్ష్యంగా గుడాల చంటిబాబు నామినేషన్
Poduru: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాధపురం ఎంపీటీసీ అభ్యర్థిగా, ఎంపీపీ పదవి లక్ష్యంగా వైసీపీ నేత గుడాల చంటిబాబు నామినేషన్ దాఖలు చేశారు.
Poduru: ఎంపీపీ లక్ష్యంగా గుడాల చంటిబాబు నామినేషన్
పోడూరు: పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పోడూరు మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు గుడాల చంటిబాబు పోడూరు మండలం జగన్నాధపురం ఎంపీటీసీ అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేశారు. మండల పరిషత్ అధ్యక్ష పదవి ఆశావహుడిగా ఉన్న ఆయన మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆశీస్సులతో నామినేషన్ వేశారు.
మాజీ ఎంపీటీసీ గణపతిరాజు ఆయన అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. పోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి డాక్టర్వి. వి.శైలజకు నామినేషన్ పత్రాలనుసమర్పించారు.
ఈ సందర్భంగా గుడాల చంటిబాబు మాట్లాడుతూ, ఎంపీటీసీగా విజయం సాధించి, ఎంపీపీగా ఎన్నికైతే పోడూరు మండల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తూ, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, మండలంలోని అన్ని గ్రామాల అభివృద్ధికి సమాన ప్రాధాన్యమిస్తానని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆయన అన్నారు.




