Gurajada: గురజాడ అప్పారావు సేవలు చిరస్మరణీయం: కలెక్టర్ చదలవాడ నాగరాణి!

Gurajada: గురజాడ సేవలు చిరస్మరణీయం: కలెక్టరేట్‌లో గురజాడ అప్పారావు జయంతి వేడుకలు. చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జేసీ కల్పశ్రీ.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Updated on: 21 Sept 2026 8:03 PM IST
Gurajada
X

Gurajada: గురజాడ అప్పారావు సేవలు చిరస్మరణీయం: కలెక్టర్ చదలవాడ నాగరాణి!

గురజాడ: గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టరేట్ పీజిఆర్ఎస్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా జాయింట్ కలెక్టర్ కె.ఆర్. కల్పశ్రీ గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురజాడ అప్పారావు ఆధునిక తెలుగు సాహిత్యానికి దిశానిర్దేశం చేసిన మహనీయుడని పేర్కొన్నారు. తన రచనల ద్వారా సమాజంలోని మూఢనమ్మకాలు, సామాజిక అసమానతలు, అన్యాయాలను ప్రశ్నిస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారని తెలిపారు. సమాజ అభ్యున్నతికి సాహిత్యం ఒక శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుందని తన రచనల ద్వారా గురజాడ చాటిచెప్పారని అన్నారు.

దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అనే గురజాడ సందేశం ప్రజల్లో దేశభక్తి, మానవతా విలువలు, సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఉందని పేర్కొన్నారు. తెలుగు భాషను ప్రజలకు మరింత చేరువ చేయడంలో, వ్యవహారిక భాషకు ప్రాధాన్యత కల్పించడంలో గురజాడ అప్పారావు చేసిన కృషి విశేషమైనదన్నారు.

ఆయన రచనలు నేటి తరానికి కూడా స్ఫూర్తినిస్తూ సమాజంలో సమానత్వం, మానవత్వం, మహిళా గౌరవం, సామాజిక బాధ్యత వంటి విలువలను పెంపొందించేందుకు మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. యువత గురజాడ వెంకట అప్పారావు సాహిత్యాన్ని చదివి, ఆయన ఆశయాలను తెలుసుకుని సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పి. గ్లోరియా, జిల్లా టూరిజం శాఖ అధికారి ఏ. వెంకట అప్పారావు,పి జి ఆర్ ఎస్ నోడల్ అధికారి వై.దోసిరెడ్డి,డ్వామా పిడి డా. కె సి హెచ్ అప్పారావు, జిల్లా సమాచార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ టి. మోహన్ రాజు, జిల్లా స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు అధికారి ఏ .వెంకటలక్ష్మి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జి.సునీత, జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి జి పిచ్చయ్య, కలెక్టరేట్ ఏ ఓ ఎన్.వెంకటేశ్వరరావు,వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM