Poduru: తూర్పుపాలెంలో వైద్య బృందం ఫీవర్ సర్వే.. డెంగీపై అప్రమత్తం!
Poduru: పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం తూర్పుపాలెంలో సీజనల్ జ్వరాలు, డెంగీ నివారణకు వైద్య బృందం ఇంటింటా ముమ్మరంగా ఫీవర్ సర్వే నిర్వహించింది.
Poduru: తూర్పుపాలెంలో వైద్య బృందం ఫీవర్ సర్వే.. డెంగీపై అప్రమత్తం!
పోడూరు: పోడూరు మండలం తూర్పు పాలెం గ్రామములో వైద్య బృందం ఫీవర్ సర్వేకార్యక్రమంనిర్వ, హించారు. ప్రతిరోజు మండలములోని రోజుకి ఒక గ్రామం చొప్పున, జ్వరాల తీవ్రత అధికంగా డెంగీ, వైరల్ జ్వరాలతో ఇబ్బందులు దోమలతో పాటు అపరిశుభ్రత వలన జ్వరా లు వస్తుండడంతో వీటి నివారణకు సూచనలు సలహాలు చర్యలు చేపట్టారు.ఆరోగ్య పరమైన సమస్యలు వస్తే వెంటనే ఆరోగ్య సిబ్బందిని, ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని.
మెడికల్ హెల్త్ అసిస్టెంట్ డి. రామకృష్ణ,తెలియజేశారుగ్రామాల్లో వీరు ఇంటింటా ఫీవర్ సర్వే నిర్వహించారు. ఎవరైనా జర్వం, ఇతర వ్యాధిలక్షణాలతోబాధపడుతుంటే వారికి పరీక్షలు నిర్వహించి అవసరమైన చికిత్స అందిస్తున్నారు.
దోమల నివారణపై ప్రజలకు పరిసరాలను శుభ్రంగా ఉంచడం, మురికి కాల్వలు, చెత్తాచెదారం లేకుండా చూసుకునేలా, నీటి నిల్వలు ఉండకుండా స్థానికులకు అవగాహన కల్పిస్తున్నారు . గ్రామాల పరిశుభ్రతలో పంచాయతీ సిబ్బంది సాయం తీసుకుంటూ రోజు రెండు గ్రామాల్లో వైద్య సిబ్బంది పర్యటించి జ్వరాల నివారణకు కృషి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం రాజకుమారి, ఆశ వర్కర్లు ఎం కమల కె.రాణి, కె.కనకదుర్గ వెంట ఉన్నారు.




