Velerupadu: భగ్గుమంటున్న భానుడు.. బయటకు రావొద్దని తహసిల్దార్ సూచన!

Velerupadu: వేలేరుపాడులో తీవ్రస్థాయిలో వడగాల్పులు. 19వ తేదీ వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసిల్దార్ శ్రీనివాస్ హెచ్చరిక.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 16 Jun 2026 11:02 AM IST
Velerupadu
X

Velerupadu: భగ్గుమంటున్న భానుడు.. బయటకు రావొద్దని తహసిల్దార్ సూచన!

వేలేరుపాడు: వేలేరుపాడు మండలంలో భానుడు భగభగ మంటున్నాడు. రానున్న ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతలు తీవ్ర స్థాయి నుంచి ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వేలేరుపాడు తహసీల్దార్ ఎన్. శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు.

నేటి నుంచి 19వ తేదీ వరకు మండలంలో వడగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అత్యవసర పనులైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు. ఒకవేళ బయటకు రావాల్సి వస్తే తగిన జాగ్రత్తలు విధిగా పాటించాలన్నారు.

ముఖ్యంగా పగటి పూట ఎండలో తిరగవద్దని స్పష్టం చేశారు. వృద్ధులు, గర్భిణులు, చిన్నపిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాల న్నారు. బయ టకు వెళ్లేవారు తప్పనిసరిగా గొడుగు, లేదా టోపీ ధరించాలని, వడదెబ్బ బారిన పడకుండా తర చుగా మంచినీరు,మజ్జిగ, కొబ్బరినీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణం వంటి ద్రవా హారాలను సద్విని యోగం చేసుకోవా లని సూచిం చారు. వాతావరణ పరిస్థి తుల దృష్ట్యా ప్రజలంతా అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించాలని తహసీల్దార్ శ్రీనివాస్ కోరారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story