West Godavari: వాయుగుండం ఎఫెక్ట్: జిల్లాలో భారీ వర్షపాతం నమోదు!

West Godavari: పశ్చిమ గోదావరి జిల్లాలో వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో తాడేపల్లిగూడెంలో అత్యధికంగా 78.4 మి.మీ. వర్షపాతం నమోదైంది.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 25 Sept 2026 10:34 AM IST
West Godavari
X

West Godavari: వాయుగుండం ఎఫెక్ట్: జిల్లాలో భారీ వర్షపాతం నమోదు!

West Godavari: ఆర్నబ్ తుఫాన్ నేపథ్యంలో బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో జిల్లాలో గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత 24 గంటల్లో తాడేపల్లిగూడెం పట్టణంలో అత్యధికంగా 78.4 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యల్పంగా అత్తిలిలో 41.2 మి.మీ. వర్షం కురిసింది. జిల్లాలో సగటున 60.0మి.మీ. వర్షపాతం నమోదుకాగా, జిల్లా వ్యాప్తంగా మొత్తం 1199.6 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)