Ilaparru: ఇలపర్రులో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు
Ilaparru: ఇలపర్రు సొసైటీ, పంచాయతీ, పాఠశాలల్లో ఘనంగా స్వాతంత్ర్య వేడుకలు. విద్యార్థులకు ప్లేట్లు, బహుమతులు అందజేత. నాయకులు, ప్రజల ఉత్సాహభరిత భాగస్వామ్యం.
Ilaparru: ఇలపర్రులో ఘనంగా 80వ స్వాతంత్ర్య వేడుకలు
ఇలపర్రు: ఈ రోజు 80వ స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా ఇలపర్రు సొసైటి దగ్గర, పంచాయతీ దగ్గర మరియు హైస్కూల్,ఎంపీపీ స్కూల్స్ వద్ద జరిగిన స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు. స్కూల్ విద్యార్థులు అందరికీ భోజనం ప్లేట్స్ (స్టీల్ ప్లేట్స్) ఇచ్చినవారు.
ఇలపర్రు సొసైటి చైర్మన్ కేతా సత్తిబాబు ,స్కూల్ ఫస్ట్ వచ్చిన విద్యార్థులుకు నగదు బహుమతులు, ఇచ్చినవారు మాజీ సర్పంచ్ పద్మావతి గారు, సుబ్బరాజు, రామరాజు , స్కేల్స్, పెన్స్, పెన్సిల్స్, ఇచ్చినవారు ఇలపర్రు పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ AO స్పందనగారు.
ఈ కార్యక్రమం లో పాల్గొన్న హైస్కూల్ కమిటీ చైర్మన్ కృష్ణబాబు, మాజీ ఉప సర్పంచ్ దుర్గారావు, గ్రామ టిడిపి అధ్యక్షుడు సూర్యనారాయణరాజు, జనసేన నాయకులు లక్ష్మణ్, దుర్గాప్రసాద్, నీటి సంఘం డైరెక్టర్ వెంకటేశ్వరరావు, పార్టీ సెక్రటరీ వెంకన్న, సొసైటి డైరక్టర్ నరసింహారాజు, త్రిమూర్తులు, హైస్కూల్ HM రాంబాబుగారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, టిడిపి, జనసేన, బిజెపి, నాయకులు, పంచాయతీ కార్యదర్శి, సొసైటి సెక్రటరీ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




