Penugonda: సేవా కార్యక్రమాలతో వివాహ వార్షికోత్సవం ఇలపర్రు పీఏసీఎస్ చైర్మన్ ఆదర్శం

Penugonda: పెనుగొండ మండలం ఇలపర్రు పీఏసీఎస్ చైర్మన్ కేతా సత్తిబాబు దంపతుల వివాహ వేడుక. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు స్వీట్ల పంపిణీ.

E.ABRAHAM, ACHANTA
Published on: 2 July 2026 8:55 PM IST
Penugonda
X

Penugonda: సేవా కార్యక్రమాలతో వివాహ వార్షికోత్సవం ఇలపర్రు పీఏసీఎస్ చైర్మన్ ఆదర్శం

పెనుగొండ: పెనుగొండ మండలం ఇలపర్రు సహకార సంఘం చైర్మన్ కేతా సత్తిబాబు దంపతులు తమ వివాహ వార్షికోత్సవాన్ని సేవా కార్యక్రమాలతో ఆదర్శప్రాయంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం ఇలపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.

విద్యార్థులతో ఆనందాన్ని పంచుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని కేతా సత్తిబాబు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి సేవాభావాన్ని అభినందించారు.

కార్యక్రమానికి సహకరించిన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులందరికీ కేతా సత్తిబాబు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమం స్థానికుల ప్రశంసలు అందుకుంది.

E.ABRAHAM, ACHANTA

E.ABRAHAM, ACHANTA

Next Story