Bhimavaram: గాంధీ జయంతి 'డ్రై డే' రోజున అక్రమ మద్యం విక్రయం!

Bhimavaram: భీమవరం సమీపంలో డ్రై డే నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్. 27 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM
Published on: 3 Oct 2026 4:22 PM IST
Bhimavaram
X

Bhimavaram: గాంధీ జయంతి 'డ్రై డే' రోజున అక్రమ మద్యం విక్రయం!

Bhimavaram: గాంధీ జయంతి సందర్భంగా ‘డ్రై డే’ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న బెల్ట్ షాపు నిర్వాహకుడిని భీమవరం ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

​ఈ దాడుల వివరాలను ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ G. బసంతి విలేకరులకు వెల్లడించారు. ఎక్సైజ్ నిబంధనల మేరకు గాంధీ జయంతి రోజున మద్యం అమ్మకాలపై నిషేధం (డ్రై డే) విధించినప్పటికీ, పాలకోడేరు మండలం, పాలకోడేరు గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్ అధికారులు గ్రామంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు.

​ఈ దాడుల్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి 27 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇన్స్పెక్టర్ బసంతి తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

​ఈ తనిఖీల్లో ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్లు (SI) పి. ఉమామహేశ్వరరావు, పి. సునీల్ కుమార్ మరియు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. ‘డ్రై డే’ నిబంధనలను ఉల్లంఘించి అక్రమంగా మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా అధికారులు హెచ్చరించారు.

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM

ALLURI KANAKRAJU (ARUN), BHIMAVARAM