Kukunoor: ఆర్ అండ్ ఆర్ భూముల్లో జోరుగా మట్టి తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

Kukunoor: ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో ఆర్ అండ్ ఆర్ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి.

BULLA NAGARAJU, KUKUNOOR
Published on: 12 Jun 2026 8:35 AM IST
Kukunoor
X

Kukunoor: ఆర్ అండ్ ఆర్ భూముల్లో జోరుగా మట్టి తవ్వకాలు.. పట్టించుకోని అధికారులు

ఏలూరు జిల్లా: కుక్కునూరు మండలంలోని పెదరాయి గూడెం పంచాయతీ పరిధిలోని వెంకటాపురం గ్రామ సమీపంలోని ఆర్ అండ్ ఆర్ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. కొందరు వ్యక్తులు వెంకాటాపురం గ్రామ సమీపంలోని ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీల కోసం భూసేకరణ చేసిన భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలుఅనుమతులు లేకుండా జేసీబీలతో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చిన అటువైపు కన్నెత్తి చూడడం విమర్శలున్నాయి. ట్రాక్టర్ ట్రిప్పుకు రూ. 600 - 800 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని పలువురు బాహాటంగానే చెబుతున్నారు.

రెండు రోజులుగా ఆర్ అండ్ ఆర్ కాలనీ భూముల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్న అధికారుల దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవటం లేదని స్థానికులు చెబుతున్నారు. పోలవరం నిర్వాసిత గిరిజనులకు ఇండ్లు నిర్మించడం కోసం భూ సేకరణ చేసిన భూముల్లో మట్టి తవ్వాలన్నా, ఆర్ అండ్ ఆర్ భూముల్లో మట్టిని తరలించాలన్నా తప్పని సరిగా రెవిన్యూ , మైనింగ్ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.

అవేవీ లేకుండా అక్రమార్కులు ఇష్టానుసారం ఆర్ అండ్ ఆర్ పునరావాస కాలనీ భూముల్లో యంత్రాలతో తవ్వి మట్టి తరలించుకు పోతున్నారు. మట్టి అక్రమ తరలింపుకు అడ్డుకట్ట పడటం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని పంచాయితీలో స్థానిక అధికార ప్రతిపక్ష నాయకులకు మట్టి, గ్రావెల్ తరలింపు వరంగా మారిందని, పంచాయతీ అభివృద్ధి నిమిత్తమని నెలకు రెండు మూడు సార్లు మట్టి మట్టి, గ్రావెల్ అక్రమ తవ్వి అక్రమంగా తరలి చూసుకుంటున్న అధికారులు చూచుచున్నట్లు వ్యవహరించడంపై అనుమానాలు సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతు న్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆర్ అండ్ ఆర్ భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుపుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని మట్టి అక్రమ తరలింపుకు సహకరిస్తున్న అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

BULLA NAGARAJU, KUKUNOOR

BULLA NAGARAJU, KUKUNOOR

Next Story