Tanuku: తణుకు మహిళా రిజర్వేషన్ల కోసం ప్రధానికి పోస్టుకార్డులు

Tanuku: జనగణన, పునర్విభజనతో సంబంధం లేకుండా 33% మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని ఏపీ మహిళా సమాఖ్య డిమాండ్. తణుకులో ప్రధానికి పోస్టుకార్డులు పంపిన నాయకులు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 11 July 2026 5:39 PM IST
Tanuku
X

Tanuku: తణుకు మహిళా రిజర్వేషన్ల కోసం ప్రధానికి పోస్టుకార్డులు

తణుకు: జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేసి, వచ్చే ఎన్నికల నుంచే 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ఏపీ మహిళా సమాఖ్య పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి శిథిల పుష్ప కుమారి డిమాండ్ చేశారు.

ఏపీ మహిళా సమాఖ్య జాతీయ పిలుపు మేరకు మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ ప్రధాన మంత్రికి పోస్టుకార్డులు పంపే కార్యక్రమాన్ని శనివారం తణుకులో నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య నాయకులు ప్రధాన మంత్రి పేరుతో రాసిన పోస్టుకార్డులను పోస్టు చేశారు.

ఈ సందర్భంగా సికిలే పుష్పకుమారి మాట్లాడుతూ, 2024 సాధారణ ఎన్నికల సందర్భంగా మహిళల మద్దతు కోసం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించిన కేంద్ర ప్రభుత్వం, దాని అమలుపై మాత్రం చిత్తశుద్ధి చూపడం లేదని విమర్శించారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన పేరుతో మహిళలకు న్యాయంగా దక్కాల్సిన రాజకీయ హక్కులను మరింత ఆలస్యం చేయడం సమంజసం కాదన్నారు.

మహిళలకు తక్షణమే రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేలా ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అవసరమైన నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా నాయకులు ధర్మాని పుష్పలత, పి. విజయలక్ష్మి, రేణుక, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)

Next Story