Tanuku: వైకాపా నుంచి తణుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇండుగుపల్లి!
Tanuku: తణుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైకాపా నుంచి ఇండుగుపల్లి బలరాం పేరును పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి గిరి శనివారం ప్రకటించారు. ఈ నెల 16న నామినేషన్ దాఖలు చేయనున్నారు.
Tanuku: వైకాపా నుంచి తణుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ఇండుగుపల్లి!
తణుకు: తణుకు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వైకాపా నుంచి ఇండుగపల్లి బలరాంను పార్టీ పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి గిరి ప్రకిటించారు. తణుకు వైకాపా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధిష్టానం మేరకు తణుకు నియోజవర్గ ముఖ్య నాయకులు అందుబాటులో లేకపోయినప్పటికీ ఇక్కడున్న పార్టీ శ్రేణులంతా కలిసి సమిష్టిగా నిర్ణయం తీసుకుని చైర్మన్ అభ్యర్థిగా బలరామ్ ను ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బలరాంకు ఆయన పార్టీ కండువా కప్పి అభినందనలు తెలిపారు. ఈ నెల 16 న పార్టీ కార్యకర్తలు, శ్రేణులు కలిసి ర్యాలీగా చైర్మన్ అభ్యర్థి బలరాంతో కలిసి నామినేషన్ దాఖలు చేసేందుకు మున్సిపల్ కార్యాలయానికి వెళ్తామని తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి బలరాం మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో అధిష్టానంతో పాటు పార్టీ శ్రేణులంతా కలిసి అప్పగించిన పెద్ద బాధ్యతను విజయవంతం చేయడానికి కృషి చేస్తామని ఆయన తెలిపారు.
తనకు 2013 కాంగ్రెస్ పార్టీ హయం నుంచి మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావుతో సన్నిహితంగా ఉన్నానని తెలిపారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి కౌన్సిలర్గా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి కౌన్సిలర్గా పని చేశానని తెలిపారు. 2019 లో కారుమూరి కోరిక మేరకు వైకాపా పార్టీ తీర్థం పుచ్చుకుని పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నానని తెలిపారు.
2024 లో పార్టీ అధికారంలో లేకపోయినప్పటికీ తాను చేసిన కృషిని గుర్తించి పార్టీ అధిష్టానం ఈ బాధ్యతను తనకు అప్పగించారని ఆయన అన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయినదని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం చేస్తానని పట్టణ ప్రజలు తమ విలువైన ఓటును తనకు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.




