Iragavaram: కే. ఇలిందలపర్రు సర్పంచిగా తెదేపా అభ్యర్థి సుధాకర్ రావు ఏకగ్రీవం

Iragavaram: ఇరగవరం మండలం కాకుల ఇలిందలపర్రు గ్రామ సర్పంచిగా తెదేపా అభ్యర్థి ఇళ్ల సుధాకర్ రావు ఏకగ్రీవం; ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, గ్రామ పెద్దల సహకారం.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 23 Nov 2026 4:37 PM IST
Iragavaram
X

Iragavaram: కే. ఇలిందలపర్రు సర్పంచిగా తెదేపా అభ్యర్థి సుధాకర్ రావు ఏకగ్రీవం

ఇరగవరం: ఇరగవరం మండలం కాకుల ఇల్లిందలపర్రు తెదేపా అభ్యర్థి ఇళ్ల సుధాకర్ రావు గ్రామ సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామ పెద్దల ఆశీస్సులతో గ్రామంలో కంపోస్ట్ యాడ్ నిర్మాణానికి ప్రతిపక్ష పార్టీలు గ్రామ అభివృద్ధికి సహకరించడంతో సుధాకర్ రావు ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

పార్టీలకు అతీతంగా గ్రామంలో పారిశుధ్య సమస్యను తీర్చేందుకు ప్రతిపక్ష పార్టీతో సహా సహకరించడంతో పంచాయతీ ఎన్నికల్లో విజయ కేతనం ఎగురవేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ అభ్యర్థి సుధాకర్ రావు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణతో పాటు గ్రామ పెద్దల సహకారంతో నా మీద నమ్మకంతో సర్పంచి ఏకగ్రీవం చేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.

గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే రాధాకృష్ణ సహకారంతో పాటు గ్రామ పెద్దల ఆశీస్సులతో గ్రామాన్ని ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి పదంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ప్రధానంగా మురికివాడల్లో పారిశుద్ధ్య సమస్యలు, రహదారి, తాగునీటి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)