Iragavaram: ఇరగవరంలో చిట్టీల పేరుతో మోసం – పోలీసులను ఆశ్రయించిన బాధితులు
Iragavaram: చిట్టీల పేరుతో రూ. లక్షల్లో వసూలు చేసి పరారైన శ్రీ దుర్గా భవాని ఫైనాన్స్ వ్యాపారి గోలి శ్రీనివాసరావుపై ఇరగవరం పీఎస్‌లో బాధితుల ఫిర్యాదు.
Iragavaram: ఇరగవరంలో చిట్టీల పేరుతో మోసం – పోలీసులను ఆశ్రయించిన బాధితులు
ఇరగవరం: చిట్టీల పేరుతో డబ్బులు కట్టించుకొని తిరిగి చెల్లించకుండా మోసం చేశారని ఆరోపిస్తూ ఇరగవరం మండలం అయినపర్రు, ఒగిడి, ఎర్రాయి చెరువు గ్రామాలకు చెందిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు ఇరగవరం పోలీస్ స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు.
తణుకు పట్టణానికి చెందిన శ్రీ దుర్గా భవాని ఫైనాన్స్ వ్యాపారి గోలి శ్రీనివాసరావు ఎర్రవరం మండలంలో చిట్టీల పేరుతో కొంతమంది వ్యక్తుల నుంచి రూ. లక్షల్లో డబ్బులు వసూలు చేసి పరారైనట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. తణుకుతో పాటు ఇరగవరం, అత్తిలి, పెనుమంట్ర మండలాల పరిధిలో ఫైనాన్స్ వ్యాపారం పేరుతో పలువురు వ్యక్తుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు.
డబ్బులు తిరిగి చెల్లించాల్సిన సమయం వచ్చినప్పటికీ స్పందించకపోవడం, వ్యక్తి పరారిలో ఉండడంతో బాధితులు ఆందోళనకు దిగారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ అయినపర్రు, ఒగిడి, ఎ రాయి చెరువు గ్రామాలకు చెందిన బాధితులు ఇరగవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని బాధితులు పోలీసులను కోరారు. బాధితుల ఫిర్యాదుల మారకు విచారణ చేపట్టి, వాస్తవంగా ఎంత సొమ్ము వసూలు చేశారు? ఎంతమంది బాధితులు ఉన్నారు? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరిస్తామని ఇరగవరం ఎస్సై ఎండి నజీరుల్లా తెలిపారు. ఈ సంఘటనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని వెల్లడించారు.
1. కడలి లక్ష్మి.. బాధితురాలు
2. చంద్రావతి.. బాధితురాలు




