Tanuku: తణుకు ఆసుపత్రిలో రోగులకు ఇస్కాన్ అన్నదానం!
Tanuku: పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు మరియు వారి సహాయకులకు ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం చేపట్టారు.
Tanuku: తణుకు ఆసుపత్రిలో రోగులకు ఇస్కాన్ అన్నదానం!
Tanuku: ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు, వారి సహాయకులకు అన్నదానం చేయడం అభినందనీయమని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ కే సాయికిరణ్ అన్నారు. తాడేపల్లిగూడెం ఇస్కాన్ సంస్థ ప్రతినిధి మురళీనాధ శ్యామదాసు ప్రభూజీ ఆధ్వర్యంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన వితరణ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ టి.రామ్ కుమార్, ఆస్పత్రి ఆర్ఐవో డాక్టర్ ఎల్ సాయి బాలాజీ, పిల్లల వైద్య నిపుణులు వత్సవాయి వెంకటరాజు తదితరులు పాల్గొన్నారు.




